అమెరికన్ ఎకానమీకి భారతీయ విద్యార్థుల సహకారం

ఆర్థిక వ్యవస్థకు 7.6 బిలియన్‌ డాలర్లు అందజేత

indian Students' Contribution to the American Economy
indian Students’ Contribution to the American Economy

వాషింగ్టన్‌: 2019-20లో అమెరికా ఎకానమీకి భారతీయ విద్యార్థుల కాంట్రిబ్యూట్‌ చేసింది ఎంతో తెలుసా?

గత ఏడాదితో పోలిస్తే భారతీయ విద్యార్థుల సంఖ్య 4.4శాతం తగ్గినప్పటికీ 2019-20 విద్యా సంవత్సరంలో మన విద్యార్థులు అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థకు 7.6బిలియన్‌ డాలర్లు అందించారు.

చైనా, భారత్‌ సహా ఎన్నో దేశాల విద్యార్థులు అమెరికాలో చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు.

ప్రతి సంవ్పరం లక్షలాది మంది విద్యార్థులు అమెరికాకు చదువుల కోసం వెళ్తారు. వీరు అమెరికా జిడిపి వృద్ధికి దోహదపడుతున్నారు.

అమెరికాకు చదువుల కోసం వెళ్లే విద్యార్థుల్లో చైనా, భారత్‌, జపాన్‌, దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి ఉన్నారు. భారత్‌ నుంచి గత ఏడాది 1,93,124మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.

అయితే భారత్‌ కంటే చైనా నుంచి అధిక రాబడి వచ్చింది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో చైనీలు మొదటి స్థానంలో ఉన్నారు. వరుసగా 16వ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది.

2019-20 సంవత్సరంలో 3,72,000మంది చైనీస్‌ విద్యార్థులు చదువుల కోసం అమెరికా వెళ్లారు. అంటే భారత విద్యార్థులతో పోలిస్తే దాదాపు రెండింతలు.

2019-20 సంవత్సరంలో అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులు 1.8శాతం తగ్గినప్పటికీ యునైటెడ్‌ స్టేట్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టంలో మొత్తం విద్యార్థుల్లో వీరి వాటా 5.5శాతంగా ఉంది.

యునైటెడ్‌ స్టేట్స్‌ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ ప్రకారం అమెరికాకు ఇంటర్నేషనల్‌ విద్యార్థుల కాంట్రిబ్యూషన్‌ 44బిలియన్‌ డాలర్లు.

ఇందులో భారత విద్యార్థుల వాటా 7.6బిలియన్‌ డాలర్లు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/