డాక్టరు చీటీ రాసిస్తేనే మ‌ద్యం

కేరళ సీఎం ఆదేశం

Alcohol with doctor’s prescription- kerala Govt

తిరువానంతపురం: కేర‌ళ‌లో ప‌రిస్థితి ఇందుకు భిన్నం. డాక్ట‌ర్లు రాసిస్తే అక్క‌డ లిక్కర్ ఇస్తారు. . కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్ ఈ మేర‌కు ఆదేశాలిచ్చారు. డాక్టరు చీటీ రాసిస్తేనే మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేయండంటూ ఆయ‌నే స్వ‌యంగా ఆబ్కారీ శాఖకి ఉత్త‌ర్వులిచ్చారు. 

క‌రోనా కార‌ణంగా కేర‌ళ‌లో మ‌ద్యం అమ్మ‌కాలు బంద్ చేశారు. మ‌ద్యానికి అల‌వాటైన చాలామంది గుక్క దిగ‌క మాన‌సిక రోగులుగా మారుతున్నారు.

కొంద‌రు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. మ‌ద్యానికి బానిస‌లైన‌వారు అప‌భ్రంశ‌పు చ‌ప‌ల‌చిత్తానికి గుర‌వ‌డం స‌హ‌జ‌మైన ప‌రిణామంగా కేర‌ళ ప్ర‌భుత్వం గుర్తించి ఈ చ‌ర్య తీసుకుంది.

అంతేకాదు. ఇలాంటివారి త‌క్ష‌ణం ఆస్ప‌త్రుల్లో చేర్చుకుని ఉచిత వైద్యం అందించాల‌ని అడిక్ష‌న్ సెంట‌ర్ల‌ను ఆదేశించారు.

ఉన్న‌ట్టుండి మ‌ద్యాన్ని ఏమాత్రం అందుబాటులో లేకుండా చేయ‌డం వ‌ల్ల ఇలాంటి అవాంఛ‌నీయ ప‌రిణామాలు త‌లెత్తుతున్నందున‌, లిక్క‌ర్‌ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చే అంశాన్ని కూడా ప‌రిశీలిస్తున్న‌ట్టు కేర‌ళ‌ ముఖ్య‌మంత్రి తెలిపారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/