కర్నూలు జిల్లాలో రైతుకు 10 లక్షల విలువైన వజ్రం లభించింది

కర్నూలు జిల్లాలో ఓ రైతుకు రూ.10 లక్షల విలువైన వజ్రం పొలంలో లభించింది. కానీ ఆ రైతు..ఓ వ్యాపారికి కేవలం లక్షన్నరకే అమ్మేశాడు. కానీ ఆ తర్వాత దాని విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని తెలిసి అయ్యో అనుకోవడం మొదలుపెట్టాడు.

వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామానికి చెందిన రైతు..తన పొలంలో పొలం పనులు చేస్తుండగా..ఒక్కసారిగా కళ్ల ముందు జిగేల్ అనిపిస్తూ వజ్రం దొరికింది. దానిని చూసి ఎంతో సంతోషపడుతూ ఇంటికి తీసుకెళ్లాడు..తనకు తెలిసిన ఓ బంగారి వ్యాపారి వద్దకు వెళ్లి తనకు లభించిన వజ్రాన్ని ఒక లక్ష యాభై వేల రూపాయలకు స్ధానిక అమ్మేశాడు. అయితే బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని స్ధానికులు చెప్పడం తో అరే ఎంత తక్కువకు అమ్మేసానో అంటూ బాధపడుతున్నాడు.