ఇంటర్వెల్ కు 15 నిమిషాల ముందు చరణ్ మరియు ఎన్టీఆర్ ఫైట్..ప్రేక్షకులు కన్నీరు పెట్టుకోవాల్సిందే

ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్నకొద్దీ సినిమా తాలూకా అనేక విశేషాలు బయటకొస్తూ..సినిమా ఫై మరిన్ని అంచనాలు పెంచడమే కాదు ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనే ఆసక్తి పెంచేస్తుంది. తాజాగా ఇంటర్వెల్ కు 15 నిమిషాల ముందు చరణ్ మరియు ఎన్టీఆర్ ఫైట్ గురించి ఓ వార్త బయటకు వచ్చి అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

ఇంటర్వెల్ కు 15 నిమిషాల ముందు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల ఫైట్ మొదలు అవుతుందట. దాదాపుగా ఇద్దరి మద్య సాగే పది హేను నిమిషాల సన్నివేశాలు మరియు ఫైట్స్ ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తాయని అంటున్నారు. విజయేంద్ర ప్రసాద్ సైతం మాట్లాడుతూ ఇద్దరు హీరోల మద్య ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ సమయంలో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారని అన్నాడు. ఆ ఫైట్ ఇంటర్వెల్ కు ముందు వస్తుందట. ఇద్దరి మద్య సన్నివేశాలు మరియు ఫైట్ ప్రేక్షకులను అలాగే చూస్తూ ఉండిపోయేలా ఉంటాయని అంటున్నారు. మరి ఆ ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

ఇక ఈ మూవీ ని తెలుగు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా జనవరి 07 వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అలాగే, టర్కిష్, స్పానిష్, పోర్చుగీస్, కొరియన్, జపనీస్, చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో కూడా దీన్ని డబ్బింగ్ చేయబోతున్నారు.