వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం చాక్లెట్ ఇచ్చి నిలువు దోపిడీ చేస్తోందిః కన్నా
ఎస్సీ కార్పొరేషన్ కింద 26 పథకాలను రద్దు చేశారు..కన్నా లక్ష్మీనారాయణ

అమరావతిః జగన్ ప్రభుత్వం జనాలకు చాక్లెట్ ఇచ్చి నిలువు దోపిడీ చేస్తోందని ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. జగన్ పాలన మోసపూరిత వ్యాపార ధోరణితో కొనసాగుతోందని విమర్శించారు. జనాలకు చాక్లెట్ ఇచ్చి నిలువుదోపిడీ చేస్తున్నారని అన్నారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా దిగజార్చారని దుయ్యబట్టారు. ఎస్పీ కార్పొరేషన్ నిధులను మల్లించకూడదనే చట్టం గతంలోనే ఉందని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ కింద జరగాల్సిన 26 పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను మల్లించకూడదని గతంలోనే చట్టం చేశారని.. అయితే వీటిని జగన్ పట్టించుకోలేదని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/news/national/