కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయ్యిందంటూ పేర్ని నాని ఫై వంగవీటి రాధా ఫైర్

ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలంతా మాటల యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో కుల ప్రస్తావనఫై కామెంట్స్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో మంత్రి పేర్నినాని చేసిన కాపుల ప్రస్తావన సొంత కులంలోనూ చిచ్చు రేపుతోంది. మేంమేం.. అంటూ నాని చేసిన ఆ వ్యాఖ్యలపై కాపులు రగిలిపోతున్నారు. ఈ క్రమంలో పేర్ని నాని ఫై వంగవీటి రాధా ఆగ్రహం వ్యక్తం చేసారు. కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయ్యిందంటూ కామెంట్స్ చేసారు.

ఖమ్మం జిల్లాలో ఎర్రుబాలెం మండలం కొత్తపాలెంలో తండ్రి వంగవీటి మోహనరంగా విగ్రహం ఆవిష్కరణకు వచ్చిన వంగవీటి రాధా.. పేర్నిని టార్గెట్ చేశారు. నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయిందంటూ నిప్పులు చెరిగారు. వాళ్లేదో గొప్పగా భావిస్తూ… పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారని రాధా వ్యాఖ్యానించారు. ఈ కులం వారంతా ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉందని గుర్తు చేశారు. ఐకమత్యమే బలం.. ఉన్నవారిని అయినా కాపాడుకోండని రాధా పిలుపునిచ్చారు.