కర్ణాటక బంద్‌లో ఉద్రిక్తత

karnataka-bandh
karnataka-bandh

బెంగళూరు: కర్ణాటకలో బంద్ కొనసాగుతోంది. కన్నడ సంఘాలు తలపెట్టిన బంద్ కొన్ని చోట్ల ఉద్రిక్తంగా మారింది. మంగళూరు సమీపంలో ఆంధ్ర బస్సులపై నిరసన కారులు రాళ్ల దాడికి దిగారు. కర్ణాటకలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ ఇవాళ, రేపు బంద్ కు పిలుపునిచ్చాయి కన్నడ సంఘాలు. ఈ బంద్ కు ఆరువందల సంఘాలు మద్దతునిచ్చాయి. బంద్ కారణంగా గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను విద్యాసంస్థలు వాయిదా వేశాయి. స్థానికులకే ఉద్యోగాలు కేటాయించాలని కన్నడ సంఘాల వినతిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో బంద్ కు పిలుపునిచ్చాయి. ఇవాళ కర్ణాటకలో పెద్ద ఎత్తున ర్యాలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో బెంగళూరులో నగరంలో బస్సలు యదావిధిగా తిరుగుతున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/