మోడి ఆహ్వానానికి ధన్యావాదలు

నేను, నా భర్త భారత్‌ పర్యటనపై చాలా ఆసక్తిగా ఉన్నాం..మెలానియా ట్రంప్

modi-melania-trump
modi-melania-trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ భారత్‌ పర్యటపై స్పందించారు. తాను, తన భర్త భారత్‌ పర్యటనపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని మెలానియా ట్రంప్‌ అన్నారు. ట్విట్టర్ ద్వారా మెలానియా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘మోడిగారు మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. ఢిల్లీ, అహ్మదాబాద్ పర్యటనల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అమెరికా, భారత్ ల మధ్య ఉన్న బలమైన బంధాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాం’ అని ట్వీట్ చేశారు. రెండు రోజుల పర్యటనకు గాను ఈ నెల 24న ట్రంప్ తన భార్యతో ఇండియాకు విచ్చేస్తున్న విషయం తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/