‘లాల్ సింగ్ చద్దా’ ప్రేయసి ని పరిచయం చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి లాల్ సింగ్ చద్దా ప్రేయసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, నాగ చైతన్య లు నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఆగస్టు 11 న తెలుగు , తమిళ్ . హిందీ భాషల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆస్కార్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే చిత్రం తాలూకా ప్రమోషన్ కార్యక్రమాలు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృతను పెంచాయి. రీసెంట్ గా హైదరాబాద్ చిరంజీవి ఇంట్లో ఈ చిత్ర ప్రివ్యూ ను చిరంజీవి , రాజమౌళి , అమిర్ ఖాన్ , నాగ చైతన్య , నాగార్జున , సుకుమార్ తదితరులు చూడడం జరిగింది.

తాజాగా ఈ చిత్రం నుంచి కరీనా ఫస్ట్ లుక్ ను చిరంజీవి విడుదల చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఫోటో షేర్ చేశారు. ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను..వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’ అని ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత అమిర్ న‌టించిన ఈ సినిమాను అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అమిర్ ఖాన్‌, కిర‌ణ్ రావ్‌, జ్యోతి దేశ్ పాండే, వ‌యాకామ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం ఆమిర్ ఖాన్ డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌నిపించ‌టానికి త‌న శ‌రీరాన్ని ఈ వ‌య‌సులో బాగానే క‌ష్ట‌పెట్టార‌ట‌. మ‌రి ఆయ‌న క‌ష్టం ఏ మేర‌కు స‌ఫ‌లీకృత‌మ‌వుతుంద‌నేది వెండితెర‌పై చూడాల్సిందే.