మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ పార్టీకి బిగ్‌ షాక్‌

అధికార టిఆర్ఎస్ పార్టీ కి వరుస షాక్ లు తగులుతున్నాయి. వరుసగా నేతలు పార్టీకి రాజీనామా చేసి బిజెపి లో చేరుతుండడం పార్టీ అధిష్టానికి నిద్రపట్టకుండా చేస్తుంది. ఇప్పటికే పలువురు రాజీనామా చేయగా..తాజాగా మహేశ్వరం నియోజకవర్గంలో బిగ్‌ షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌ పార్టీకి బడంగ్‌పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపించారు.

ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో టిఆర్ఎస్ పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని అనివార్య, వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీలో తనకు సహాకరించిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బడంగ్ పేట అభివృద్ధిని కాంక్షించి పార్టీలో చేరడం జరిగిందని, అప్పటి నుంచి నేటి వరకూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామని ఆమె పేర్కొన్నారు. మరి ఈమె నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.