బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో సెమీస్‌కు భారత్

మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షి్‌ప్సలో భా రత పురుషుల జట్టు సెమీస్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకొంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో భారత్ 32తో థాయ్‌లాండ్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. 22తో స్కోరు సమమైన స్థితిలో ఆఖరి డబుల్స్ మ్యాచ్‌లో చిరాగ్ షెట్టికి జోడీగా బరిలోకి దిగిన కిడాంబి శ్రీకాంత్ 2115, 1621, 2115తో మనీపోంగ్ జోన్జిట్నిపిటపోన్పై నెగ్గి భారత్‌ను సెమీ్‌సకు చేర్చాడు. సింగిల్స్‌లో సాయి ప్రణీత్, శ్రీకాంత్ పరాజయం పాలైనా.. రెండు డబుల్స్, మరో సింగిల్స్‌లో నెగ్గిన భారత్ సెమీ్‌సకు దూసుకెళ్లింది. శనివారం జరిగే ఫైనల్4 మ్యాచ్‌లో డబుల్ డిఫెండింగ్ చాంప్ ఇండోనేసియాతో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్‌లో సాయి ప్రణీత్.. వాంగ్‌చరోయిన్ చేతిలో, శ్రీకాంత్… విటిడ్‌శర్న్ చేతిలో ఓడడంతో భారత్ 02తో వెనుకబడింది. అయితే, మూ డో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో అర్జున్‌ధ్రువ్ కపిల జోడీ, తర్వాత జరిగిన సింగిల్స్‌లో లక్ష్యసేన్ అద్భుత విజయంతో స్కోరు 22తో సమమైంది. ఆఖర్లో శ్రీకాంత్ జోడీ షినిషింగ్ టచ్ ఇచ్చింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/