కాంతార చిత్రానికి మరో అరుదైన గౌరవం

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. కేవలం రూ.16 కోట్ల తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్లు సాధించింది. విడుదలైన అన్ని భాషల్లో అఖండ విజయం సాధించి ఎన్నో అవార్డ్స్ దక్కించుకుంది. తాజాగా ఇక ఇప్పుడు మార్ అరుదైన గౌరవం దక్కించుకుంది.

జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నేడు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో నటుడు, దర్శకుడు రిషభ్‌ శెట్టి ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకున్నారు. సినిమా స్క్రీనింగ్ ముగిసిన అనంతరం పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమాల పాత్రపై ఆయన ప్రసంగిస్తారు. కాగా, ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శితమయ్యే తొలి చిత్రంగా ‘కాంతార’ రికార్డ్స్ లో నిలవబోతుంది.

రిషభ్ షెట్టి, కిషోర్‌కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, సప్తమిగౌడ, ప్రమోద్‌ షెట్టి ప్రధాన పాత్రల్లో నటించారిందులో. రిషభ్ షెట్టి స్వీయ దర్శకత్వంలో సినిమాను రూపుదిద్దుకుంది. హోంబలే ఫిలింస్‌ బ్యానర్ కింద విజయ్‌ కిరగందూర్‌ సినిమాను నిర్మించారు. దీనికి ప్రీక్వెల్ నిర్మించే పనుల్లో ఉంది చిత్రం యూనిట్. జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.