రాయలసీమలో మూడు రోజులు చంద్రబాబు పర్యటన

మినీ మహానాడులు, నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్న బాబు

chandrababu-to-visit-rayalaseema-districts-today

అమరావతి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో మినీ మహానాడులు నిర్వహించనున్నారు.

నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేబట్టి, రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు. దీనికితోడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు పార్టీ అధినేత పర్యటనల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/