బిగ్ బాస్ 5 : హౌస్ కు కొత్త కెప్టెన్ గా శ్రీరామ్..

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి వారంలాగానే నాల్గో వారంలోను కెప్టెన్సీ కోసం పోటీ జరిగింది. సన్నీ, శ్వేత, శ్రీరామ్ పోటీ పడగా.. వీరిలో ఎవరు కెప్టెన్సీకి అనర్హులో వివరణ చెప్పి. వారి నడుముకు కట్టిన బెల్త్‌పై కత్తులు పొడవాలంటూ మిగతా కంటెస్టెంట్లకు బిగ్ బాస్ సూచనలు ఇచ్చాడు.

ఈ క్రమంలోనే అత్యధిక కత్తి పోట్లు సన్నీకి పడ్డాయి. తర్వాత శ్వేతకు పడ్డాయి. తక్కువగా శ్రీరామ్ కు పడడంతో ఈ వారం హౌస్ కెప్టెన్ గా శ్రీరామ్ ను ప్రకటించారు. అయితే అత్యధిక కత్తి పోట్లు సన్నీకి పడడంతో సన్నీ తట్టుకోలేకపోయాడు. దాదాపుగా తన మిత్రులు అనుకున్నవారు కూడా ద్రోహం చేసారని వాపోయాడు. ఇక ఈ వారం బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు..వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అనేది సభ్యులను తెలపాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించారు. అది ఎవరు అవుతారనేది రేపు తెలుస్తుంది. ఇక ఈ వారం నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌, లోబో, యాంకర్‌ రవి, ప్రియ, కాజల్‌, సిరి హన్మంత్‌ లు నామినేషన్‌లో ఉన్నారు.