సోము ఫై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు

ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఫై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. మొన్నటి వరకు జనసేన – బిజెపి కలిసి ముందుకు వెళ్తాయని అనుకున్నారు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్.. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినా బలంగా పనిచేయలేకపోయామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధాని మోదీ అన్నా, బీజేపీ అన్నా తనకు గౌరవం ఉందని అలాగని తన స్థాయిని తగ్గించుకోలేనని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర రాజకీయ ముఖాచిత్రం మారబోతుంది. బీజేపీని రోడ్డు మ్యాప్ అడుగడమేమిటని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని అన్నారు. రౌడీలు రాజ్యాన్ని పాలిస్తుంటే.. నా ప్రజలను రక్షించుకోవడానికి నేను నా వ్యుహాన్ని కూడా మార్చుకున్నాను. అంతా మాత్రాన నేను ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకం కాదు. ఎప్పుడు కలుస్తాం.. ముందుకు తీసుకెళ్తాం.. కానీ ఊడిగం మాత్రం చేయమని పవన్ కల్యాణ్ అన్నారు.

పవన్ కళ్యాణ్ కామెంట్స్ తర్వాత బిజెపి తో కటీఫ్ చెప్పినట్లే అని , టీడీపీ తో జనసేన కలవడం గ్యారెంటీ అని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే అంటూ మండిపడ్డారు. సోము వీర్రాజు ఒక్కడే అన్నింటిని చూసుకోవడం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని.. పార్టీలో ఏం జరుగుతుందో తమకు కూడా అస్సలు తెలియడం లేదని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.