జనసేన కార్యకర్తలకు బెయిల్ నిరాకరణ…

జనసేన కార్యకర్తలకు బెయిల్ నిరాకరించింది ఏపీ హైకోర్టు. అదే సమయంలో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందిస్తూ కస్టడీకి అనుమతిఇచ్చింది. మూడు రోజుల క్రితం వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్ద జనసేన కార్య కర్తలు తమఫై దాడి చేసారని వైస్సార్సీపీ నేతలు జనసేన కార్య కర్తల ఫై పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో దాదాపు 70 మంది జనసేన కార్య కర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా… అరెస్టయిన వారిలో 61 మంది నిందితులకు అక్కడికక్కడే బెయిల్ లభించింది. మిగిలిన 9 మందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 9 మంది తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా… వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించడంతో పాటు… పోలీసుల అభ్యర్థన మేరకు వారిని పోలీసు కస్టడీకి అనుమతించింది.