మిచిగాన్‌లో ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని కోర్టులో దావా
-ట్రంప్ క్యాంపెయిన్ వెల్లడి

Washington: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి మిచిగాన్‌లో ఓట్ల లెక్కింపు ఆపివేయాలని పేర్కొంటూ కోర్టులో దావా వేసినట్టు ట్రంప్ క్యాంపెయిన్ వెల్లడించింది..
ఓట్ల లెక్కింపుఎలా జరుగుతుందో చూడటానికి తమకు అనుమతి ఇవ్వటం లేదని ఆరోపించింది..
బ్యాలెట్లు ఓపెన్ చేయటం, ఓట్లను లెక్కించే ప్రక్రియను వీక్షిచేందుకు తమకు అనుమతి ఇవ్వాలని, అప్పటిదాకా ఓట్ల లెక్కింపు జరగకుండా చూడాలని దావా వేసినట్టు ట్రంప్ క్యాంపెయిన్ వెల్లడించింది..
ఇదిలా ఉండగా ట్రంప్ క్యాంపెయిన్ రీకౌంటింగ్ కోరిన విస్కాన్సిన్ రాష్ట్రంలో బైడెన్ విజయం కేతనం ఎగురవేశారు.. మరో 10 ఎలక్ట్రోరల్ ఓట్లను సొంతం చేసుకున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/