ఎపి, తెలంగాణ బిజెపి ఇన్‌చార్జిల మార్పు

ప్రధాన కార్యదర్శులకు, కార్యకర్తలకు బాధ్యత అప్పగింత

BJP President JP Nadda
BJP President JP Nadda

New Delhi: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు బిజెపి ఇన్‌చార్జీలను అధిష్ఠానం మార్చింది.పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు బాద్యతలు అప్పగిస్తూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నిర్ణయం తీసుకున్నారు.

ఈక్రమంలో చాలా రాష్ట్రాల్లోనూ పార్టీ ఇన్‌చార్జీలను మార్చారు. తెలంగాణ బిజెపి ఇన్‌చార్జీగా తరుణ్‌చౌగను నియమించింది.

ఆంధ్రప్రదేశ్‌ బిజెపి ఇన్‌చార్జీగా మురళీధర్‌ను నియమించగా, సహా ఇన్‌చార్జీగా సునీల్‌ దేవధర్‌ను కొనసొగించింది.

ఇక ఏపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరిని రెండు రాష్ట్రాలకు ఇన్‌చార్జీగా పార్టీ అధిష్ఠానం నియమించింది. చత్తీస్‌గఢ్‌,ఒడిశా ఇన్‌చార్జీగా పురందేశ్వరిని నియమించింది.

ఉత్తరప్రదేశ్‌ సహా ఇన్‌చార్జ్‌,అండమాన్‌ నికోబార్‌ ఇన్‌చార్జ్‌గా సత్యకుమార్‌ను నియమించింది.

కర్ణాటక సహా ఇన్‌చార్జీగా డికె అరుణకు బాధ్యతలు అప్పగించారు. మధ్యప్రదేశ్‌ బిజెపి ఇన్‌చార్జీగా మురళీధర్‌రావును నియమించారు.

ఆ రాష్ట్రానికి సహ ఇన్‌చార్జీలు మరో ఇద్దరిని నియమించారు. ఇక తమిళనాడు సహా ఇన్‌చార్జ్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డికి బిజెపి అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు బాద్యతలు అప్పగిస్తూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నిర్ణయం తీసుకున్నారు. చాలా రాష్ట్రాల్లోనూ పార్టీ ఇన్‌చార్జీలను మార్చారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/