సీఎం జగన్ తో డీజీపీ గౌతం సవాంగ్ భేటీ

అమరావతి : సీఎం జగన్ తో ఆ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా నిన్న ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం గురించి డీజీపీ సీఎంకు వివరించనున్నట్లు తెలిసింది. పోలీసులు ఆంక్షలు విధించినా లక్షల సంఖ్యలో ఉద్యోగులు విజయవాడకు చేరుకోవడంపై జగన్ సీరియస్ అయ్యారు. పోలీసు వైఫల్యంగానే పార్టీ నేతలు కూడా అభిప్రాయపడ్డారు. అలాగే ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో భవిష్యత్ లో తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీకి సీఎం పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/