హనీమూన్ ఆల్బమ్‌లో స్పెషల్ ఫొటో
కాజల్‌కు ఇష్టమైన ఫొటోల్లో ఇదొకటి: గౌతమ్ కిచ్లూ

కాజల్ అగర్వాల్ ఇటీవల తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడి హనీమూన్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే..
మాల్దీవుల్లో ఈ జంట కాస్ట్లీయెస్ట్ హనీమూన్‌ని ఎంజాయ్ చేయటం ప్రముఖంగా చర్చకు వచ్చింది. కాజల్ కిచ్లూ జోడీ సముద్రం అడుగున అండర్ వాటర్ విన్యాసాలతో అదరగొట్టారు.
ఈ జంట విన్యాసాలు ఇప్పటికే ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. ఇప్పటికే హనీమూన్ ముగించి తిరిగి ముంబైకి వచ్చేసింది ఈ జంట..
తదుపరి వరుసగా షూటింగ్‌లతో కాజల్ బిజీ కానుంది.. ప్రస్తుత తీరక సమయాల్లో మాల్దీవుల్లో విహారానికి సంబంధించిన ఒక్కో ఫొటోను కాజల్ అగర్వాల్ అభిమానుల కోసం రివీల్ చేస్తున్నారు..
మాల్దీవుల్లో తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తాజాగా తన మాల్దీవుల ఆల్బమ్ నుంచి ఓఫొటోను కిచ్లూ ఎంచుకుని .. కాజల్‌కు ఇష్టమైన హనీమూన్ ఫొటోల్లో ఒకటి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసిన ఫొటో వైరల్ అయ్యింది..
కాజల్ పైల్సైడ్ చిల్లింగ్ మూవ్‌మెంట్‌ను , నీటిలో తేలియాడే అల్పాహారం సెషన్‌ను ఆవిష్కరించే ఫొటో ఇది..
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/