రాజ్యాంగ ప్ర‌వేశిక‌ ప‌ఠ‌నంతో జాతికి దిశానిర్దేశం

రాజ్యాంగ ప్ర‌వేశిక‌ను ప‌ఠించిన రాష్ట్ర‌ప‌తి

President Kovind leads the nation in reading the Preamble to the Constitution of India

న్యూఢిల్లీ: నేడు భార‌త రాజ్యాంగ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ రాజ్యాంగ ప్ర‌వేశిక‌ ప‌ఠ‌నంతో జాతికి దిశానిర్దేశం చేశారు. ఈ ఉద‌యం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఆయ‌న ప్ర‌వేశిక‌ను ప‌ఠించారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి స‌చివాల‌యం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక వీడియోను పోస్ట్ చేసింది. భార‌త రాజ్యాంగం ఆమోదం పొందిన న‌వంబ‌ర్ 26న‌ 2015 నుంచి రాజ్యాంగ దినోత్స‌వం జరుపుకుంటున్నారు. భార‌త రాజ్యాంగానికి 1949, న‌వంబ‌ర్ 26న రాజ్యాంగ ప‌రిష‌త్ ఆమోదం ల‌భించింది. అయితే, 1950, న‌వంబ‌ర్ 26 నుంచి ఈ రాజ్యాంగం అమ‌ల్లోకి వ‌చ్చింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/