రేవంత్.. నువ్వు మగాడివైతే 17కు 17 ఎంపీలను గెలిచి చూపించు – కడియం శ్రీహరి

సీఎం రేవంత్ రెడ్డి ఫై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నువ్వు మగాడివైతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 ఎంపీలను గెలిపించి నీ మగతనం చూపించూ అంటూ కడియం శ్రీహరి కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా ఉండి.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యేను కూడా ఎందుకు గెలిపించలేదని చురకలు అంటించారు.

రేవంత్ భాష జుగుప్సాకరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం హోదాలో హుందాగా ఉంటారని అనుకున్నామన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో..దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ ప్రగతిని వైఫల్యంగా చూపడం బాధకరమన్నారు. రాజకీయాల కోసం మేడిగడ్డను వాడుకోవద్దన్నారు. మేడిగడ్డ కుంగిపోవడానికి సాంకేతిక కారణాలు ఉండొచ్చన్నారు.

మేడిగడ్డపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోండన్నారు. మేడిగడ్డకు ఖర్చు చేసింది రూ.3వేల కోట్లు మాత్రమే అన్నారు. రాజకీయాల కోసం రైతులను కాంగ్రెస్ ఇబ్బంది పెడుతుందన్నారు. ప్రతిపక్షాలను విమర్శించడమే సీఎం రేవంత్ పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు.