విశాఖ ఘటనపై స్పందించిన హోం మంత్రి సుచరిత

పోలీసులు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న హోం మంత్రి

ap-home-minister-sucharitha

అమరావతి : విశాఖ ఘటన పై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు, అధికాచారు. ప్రమాదంపై రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఇప్పటికే విశాఖ కలెక్టర్‌తో మాట్లాడారు. ప్రమాద కారణాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. కాగా, ఈ ప్రమాదంలో కంపెనీలో పనిచేసే సీనియర్ కెమిస్ట్ నాగేశ్వరరావు (40) మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో మల్లేశ్ అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు గాజువాక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా విశాఖపట్టణంలోని పరవాడ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్ పరిశ్రమలో గత రాత్రి జరిగిన భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/