నేడు 49వ సీజేఐగా ప్రమాణం చేయనున్న యూయూ లలిత్‌

Justice UU Lalit To Take Oath As 49th Chief Justice Of India Today

న్యూఢిల్లీః నేడు భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్‌తో ప్రమాణం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరుగనున్న ఈ కార్యక్రమాని ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా, జస్టియ్‌ యూయూ లలిత్‌ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుంది. అంటే 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది.

సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంగా మాట్లాడిన జస్టిస్‌ లలిత్‌.. దేశంలోని కేసుల జాబితా, అత్యవసర వ్యవహారాల ప్రస్తావన, రాజ్యాంగ ధర్మాసనాలు అనే మూడు ప్రధాన అంశాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం కిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/