గాడ్ ఫాదర్ కలెక్షన్ల కు కాంతారా ‘కత్తెర’

kanthara movie telugu

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్ర కలెక్షన్లను కన్నడ చిత్రం కాంతారా బాగా దెబ్బతీసింది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులు కానీ సినిమా గురించి కానీ ఎవ్వరికి పెద్దగా తెలియదు. ముందుగా కన్నడలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో విడుదలై , బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తుంది.

సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉందని , ఈ సినిమా ముందు ఏ బాహుబలి , కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ ఇలా ఏ చిత్రం కూడా పనికిరాదని చెపుతుండడం తో సినిమాను చూసేందుకు పోటీ పడుతున్నారు. ఈ సినిమా టాక్ తో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. మొదటి మూడు రోజులుగా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన గాడ్ ఫాదర్..ఆ తర్వాత కలెక్షన్లు డ్రాప్ అవుతూ వచ్చాయి. ఇక కాంతారా విడుదల తర్వాత గాడ్ ఫాదర్ థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం గాడ్ ఫాదర్ 2 వీక్స్ కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 12.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.48 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.84 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.82 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.42 కోట్లు, గుంటూరులో రూ. 4.01 కోట్లు, కృష్ణాలో రూ. 2.84 కోట్లు, నెల్లూరులో రూ. 2.10 కోట్లతో కలిపి రూ. 42.72 కోట్లు షేర్, రూ. 70.25 కోట్లు గ్రాస్ వసూలైంది. కర్నాటకలో రూ. 4.70 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 5.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.14 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 57.66 కోట్లు షేర్‌, రూ. 104.70 కోట్లు గ్రాస్ వసూలు రాబట్టింది.