రైతులకు న్యాయం చేయండి.. పవన్‌

లాక్‌డౌన్‌ కారణంగా రైతులు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు

pawan kalyan
pawan kalyan

అమరావతి: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యాన, ఆక్వారైతులు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 21 లక్షల మంది గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని , ఇంకా గుర్తింపు పొందని వారు సుమారు 30 లక్షల వరకు ఉంటారని , వారంతా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వీరందరిని ఆదుకోవాలని పేర్కొంటూ కేంద్ర కార్మికశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలు రాశానని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రోజువారి కూలీలు తమ జీవనాధారాన్ని కోల్పోయారని, రాష్ట్రంలో ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులు, ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని , వీరందరికి న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పవన్‌ కళ్యాణ్‌ కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/