ఎపిలో నమోదైన కేసులన్నీ ఢిల్లీ ప్రార్థనలతో లింకులే

తాజా కేసులను వివరించిన ప్రభుత్వం

Prayers at Delhi's Nizamuddin
Prayers at Delhi’s Nizamuddin

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా నమోదైన కరోనా కేసులన్నీ ఢిల్లీకి లింకులేనని స్సష్టమైంది.. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి బంధువులకే కరోనా పాజిటివ్‌ వచ్చింది..

ఇదిలా ఉంటే ఎపి నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి గణాంకాలను ప్రభుత్వం తేల్చింది.. అన్ని జిల్లాలతో కలిపి 711 మంది ఢిల్లీకి వెళ్లివచ్చినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

వీటిలో అత్యధికంగా కర్నూలు నుంచి 189 మంది ఉన్నారని తేల్చారు.

40కి చేరిన పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40కి చేరింది..రాత్రి 9 గంటల వరకు ఇప్పటి వరకు కొత్తగా 17 కేసులు నమోదు అయ్యాయని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

బాధితుల్లో ఢిల్లీలో మతపరమై ప్రార్థనలకు వెళ్లివచ్చినవారే ఎక్కువ మంది ఉన్నారని ప్రభుత్వం హెల్త్‌బులిటెన్‌లోపేర్కొంది..

ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి
ప్రకాశం: 11, గుంటూరు 9, విశాఖ: 6, కృష్ణా: 5, తూర్పుగోదావరి: 4, అనంతపురం: 2, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు ఒక్కో కేసు నమోదయ్యాయి..

Prayers at Delhi's Nizamuddin
Prayers at Delhi’s Nizamuddin

ప్రకాశం జిల్లాలో 11 పాజిటివ్‌ కేసులు

ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ తేలింది. ఇదిలా ఉండగా 131 మంది బాధితులకు ఐపోలేషన్‌ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.