ఫేర్‌వెల్ పార్టీ కోసం పబ్‌ను బుక్ చేసుకున్నారట..

జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ రేప్‌ కేసు..రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతోంది. ఘటన జరిగి రోజులు గడుస్తున్న ఇంకా పూర్తి స్థాయిలో నిందితులను పట్టుకోవడం , అసలు నిందితులను వదిలి అమాయకులను కేసులో ఇరికిస్తున్నారనే ఆరోపణలు వస్తుండడం తో ఈ కేసు గురించి అంత మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ పబ్ కు ఎవరెవరు వచ్చారు..ఎందుకు వచ్చారు..వచ్చినవారంతా ఎవరు అనేది పోలీసులు బయటకు లాగారు.

కార్పొరేట్ స్కూల్ ఫేర్‌వెల్ పార్టీ కోసమే ఈ పబ్‌ను బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 150 మంది స్టూడెంట్స్‌ కోసం ఈ ప‌బ్ బుక్ చేశారట. నిషాన్, అయాన్, ఆదిత్య అనే వ్యక్తులు పార్టీ కోసం బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం వారు రూ.2 లక్షలు కూడా చెల్లించినట్టు సమాచారం. వీరంతా ఇంట‌ర్ సెకండియ‌ర్ స్టూడెంట్స్ అని సమాచారం. ఈ ఘటనకు సంబదించి ఇప్పటి వరకూ ఇద్దరు మైనర్లతో పాటు సాదుద్దీన్ మాలిక్​ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురు నిందితులను ఈరోజు కోర్టులో హజరుపరిచి రిమాండ్​కి తరలించనున్నారు. జూబ్లిహిల్స్ ఠాణాలో సాదుద్దీన్ మాలిక్​ను పోలీసులు విచారించారు. వైద్యపరీక్షల నిమిత్తం మాలిక్​ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్​కు తరలించనున్నారు. అరెస్టయిన మరో ఇద్దరు నిందితులైన ప్రభుత్వ సంస్థ ఛైర్మన్​ కుమారునితో పాటు ఇంకో మైనర్​ను పోలీసులు విచారిస్తున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చనున్నారు. అనంతరం ఇద్దరు మైనర్లను జువెనైల్ హోంకి తరలించనున్నారు. ఇక పరారీలో ఉన్న ఇంకో ఇద్దరు నిందితులు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.