వైస్సార్సీపీ కి వాసుపల్లి గణేష్ షాక్..

వైస్సార్సీపీ పార్టీ కి షాక్ ఇచ్చారు విశాఖ దక్షిణ ఎమ్మెల్యేవాసుపల్లి గణేశ్. వైస్సార్సీపీ ఇచ్చిన విశాఖ దక్షిణ పార్టీ ఇన్ ఛార్జ్ పదవికి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు పార్టీ ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డికి ఓ లేఖ రాశారు. సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తనకు బలనిరూపణ పెట్టడం తన గౌరవానికి భంగం కలిగించిందని, అలాగే వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.

సుబ్బారెడ్డి పర్యటన సందర్భంా తనకు శల్య పరీక్ష పెట్టడం, బల పరీక్షపెట్టడం సరికాదని వాసువల్లి గణేశ్ తెలిపారు. ఇది తన గౌరవానికి భంగం కలిగించినట్లుందని వ్యాఖ్యానించారు. టీడీపీలో తనను గౌరవముతో చూసుకున్నారని, కానీ జగన్ సంక్షేమ పథకాలు అమలు చూసి వైస్సార్సీపీ లో పని చెశానని లేఖలో గణేశ్ గుర్తుచేశారు. కానీ ఈ అవమానం భరించలేక సమన్వయ కర్తగా తప్పుకుంటున్నట్లు వాసుపల్లి తన లేఖలో సుబ్బారెడ్డికి వివరించారు. ఇక వాసుపల్లి గణేష్ కుమార్ 2009లో టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తదనంతరం టీడీపీ విశాఖ దక్షణ సమన్యయకర్తగా కొనసాగుతూ.. కాంగ్రెస్ పార్టీ హయంలో ఆ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టారు. దీంతో వాసుపల్లికి చంద్రబాబు.. టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి అప్పగించారు. ఆ పదవిలో దాదాపు చాలా సంవత్సరాలు కొనసాగారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవ్వడంతో వాసుపల్లి.. వైసీపీకి మద్దతిచ్చి.. తన కుమారులిద్దరికీ సీఎం వైఎస్ జగన్ చేత వైసీపీ కండువాలు కప్పించారు. దీంతో ఆయనకు సమన్వయకర్త పదవిని వైసీపీ అధిష్టానం కట్టబెట్టింది. ఇక ఇప్పుడు ఆ పదవికే గణేష్ రాజీనామా చేశారు.