ఈరోజు నుండి తెలంగాణ లో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు

సంక్రాంతి సందర్బంగా ఈరోజు నుండి తెలంగాణ లో విద్యాసంస్థలకు సెలవులు మొదలయ్యాయి. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులను ప్రకటించింది తెలంగాణ సర్కార్. ఈరోజు ( జనవరి 12 ) నుంచి 17 వరకు హాలీ డేస్ ను ఉండనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు మూతపడనున్నాయి. తిరిగి 18వ తేది నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

జనవరి 13న రెండవ శనివారం కాగా.. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలు ఉన్నాయి. జనవరి 17న ప్రభుత్వం పాఠశాలలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో స్కూల్ విద్యార్థులకు వరుసగా ఆరు రోజులు సెలవులు ఉండనున్నాయి. మరోపక్క సంక్రాంతి సందర్బంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడవొద్దని ఉద్దేశ్యంతో TSRTC ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పండుగకు వెళ్లే వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ తెలిపింది.