డిసెంబర్ 7 న బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్న తీన్మార్ మల్లన్న

డిసెంబర్ 7 న బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్న తీన్మార్ మల్లన్న

క్యూ న్యూస్ అధినేత, ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్..డిసెంబర్ 07 న బిజెపి పార్టీ లో అధికారికంగా చేరనున్నారు. ఈ విషయాన్నీ మల్లన్న ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. గతంలోనే మల్లన్న బిజెపి లో చేరబోతున్నారనే వార్తలు ప్రచారం జరిగినప్పటికీ..అది జరగలేదు. కానీ ఈసారి మల్లన్నస్వయంగా తెలుపడం తో అంత ఫిక్స్ అవుతున్నారు. మోడీ సిద్ధాంతాలకు తాను ఆకర్షితునుడైనట్లు… ఈ నేపథ్యంలోనే బిజెపిలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు మల్లన్న. బిజెపిలో చేరేందుకు అన్ని అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాయని… డిసెంబర్ 7వ తేదీన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు ట్వీట్ చేశారు.

ఓ స్వామిజీని, అలాగే.. తెలంగాణ ప్రభుత్వం పై చేసిన ఆరోపణల నేపథ్యంలో మల్లన్న ను అరెస్ట్ చేసారు. రీసెంట్ గా ఆయన బెయిల్ ఫై బయటకొచ్చారు. ఇక మల్లన్న రిమాండ్ లో ఉన్న సమయంలో అతడి భార్య మమత ..పీఎం మోడీ, హోం మంత్రి అమిత్​షాకు మెయిల్ ద్వారా ఓ విన్నపం విన్నవించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తన భర్త నిరంతరం పోరాడుతున్నారని అందులో పేర్కొన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ వచ్చిన ప్రతిసారి ఇష్టారీతిన సెక్షన్ల కింద కేసులు పెడుతూ జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్​లో బీజేపీ నుంచి టికెట్​ ఆశించారని వివరించారు. ఇండిపెండెంట్​గా పోటీ చేసి రెండో ప్లేస్​లో నిలిచారన్నారు. తన భర్త తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరాలనుకుంటున్నారని, మోడీ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేయాలనుకుంటు న్నారని తెలుపడం జరిగింది.