వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ వేసిన బాబు మోహన్

ప్రముఖ నటుడు , మాజీ మంత్రి బాబు మోహన్..ఎంపీ ఎలక్షన్ బరిలో ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో నేడు నామినేషన్ పర్వం చివరి రోజు సందర్బంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్లిన ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన కారును కార్యాలయం లోపలికి అనుమతించలేదు.

తాను అనార్యోగంతో బాధపడుతున్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పోలీసులపై బాబూ మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సుధీర్, బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బాబు మోహన్ బీజేపీ తరఫున ఆందోల్ నుంచి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో బాబూ మోహన్ ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన బిజెపి ని వీడి ఈ మధ్యనే ప్రజాశాంతి పార్టీ లో చేరారు.