గాయపడిన జో బైడెన్
బైడెన్ చీలమండకు గాయం

వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్న జో బైడెన్ గాయపడ్డారు. ఆయన తన పెంపుడు శునకమైన జర్మన్ షెపర్డ్‌తో కలిసి ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో ఆయన చీలమండకు గాయమైంది. ఆర్థోపెడిక్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు బిడెన్ కార్యాలయం వెల్లడించింది. బైడెన్ వద్ద రెండు శునకాలు ఉన్నాయి. వీటిలో ఒకదానిని 2008లో దత్తత తీసుకోగా, రెండోదానిని 2018లో తీసుకున్నారు. రెండేళ్ల క్రితం దత్తత తీసుకున్న మేజర్తో అనే శునకంతో ఆడుకుంటుండగా ఆయన గాయపడినట్టు బైడెన్ సిబ్బంది తెలిపారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అనంతరం శునకాలు కూడా ఆయన వెంట వైట్‌హౌస్‌కు రానున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/