2-0తో సిరీస్‌ ఆసీస్‌ సొంతం

రెండో వన్డేలోనూ ఇండియా ఓటమి- మరోసారి సెంచరీతో రాణించిన స్మిత్‌

The series was won by the Australia 2-0
The series was won by the Australia 2-0

సిడ్నీ : టీమిండియా పేలవ బ్యాటింగ్‌తో రెండో వన్డేలోనూ ఓటమి చవిచూసింది.

ఆదివారం ఎస్‌సిజిలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 51 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది.

ఆసీస్‌ డిపెండబుల్‌ బ్యాట్స్‌మెన్‌ వరుసగా రెండో సెంచరీతో జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.

స్మిత్‌ తొలి వన్డేలోవలె 62 బంతుల్లోనే సెంచరీ పూరించాడు. కాగా తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అందరూ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 389 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇది తొలి వన్డేకంటే 15 పరుగులు అధికం. సమాధానంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులే చేయగలిగింది. టీమిండియాలో కెప్టెన్‌ కోహ్లీ 89 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. కెఎల్‌ రాహల్‌ 76 పరుగులతో రాణించాడు.

స్మిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక నామమాత్రమైన మూడో వన్డే బుధవారం కాన్‌బెర్రాలోని మనుక ఓవల్‌ స్టేడియంలో జరుగుతుంది.

ఛేదనను ఇండియా ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, శిఖర్‌ ధావన్‌ ధాటిగానే ఆరంభించారు. ఇరువ్ఞరూ బౌండరీలు సాధిస్తూ తొలి వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి ఆసీస్‌ శిబిరంలో గుబులుపుట్టించారు.

అయితే తొలి వన్డేలోవలె హాజల్‌ ధావన్‌ వికెట్‌ పడగొట్టి బ్రేక్‌ సాధించాడు. తరువాతి ఓవర్లో అగర్వాల్‌కూడా వెనుతిరిగాడు. ఈ తరుణంలో కెప్టెన్‌ కోహ్లి శ్రేయాస్‌ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇరువ్ఞరూ జాగరూకతతో బ్యాటింగ్‌ చేస్తూ స్కోరును 150 పరుగులకు చేర్చారు.

ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ భాగస్వామ్యాన్ని హెన్రిక్‌ విడగొట్టాడు. అయ్యర్‌ స్టీవ్‌ స్మిత్‌ క్యాచ్‌ పట్టడంతో 38 పరుగులకు నిష్క్రమించాడు. ఆ తరువాత కోహ్లి వైస్‌కెప్టెన్‌ రాహుల్‌తో కలిసి అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి స్కోరును 200 దాటించాడు.

ఈ నేపథ్యంలో కోహ్లీ అర్ధసెంచరీతోపాటు వన్డేలలో అత్యంత వేగంగా 22వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అయితే కోహ్లీ 11 పరుగుల తేడాతో సెంచరీని మిస్సయ్యాడు. మరోసారి హాజల్‌వ్ఞడ్‌ భారత్‌ పాలిట విలన్‌లా కోహ్లి వికెట్‌ పడగొట్టాడు.

కోహ్లీ 87 బంతుల్లో రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 89 పరుగులు చేశాడు. వన్డేలలో కోహ్లికిది 59వ అర్ధసెంచరీ. ఆ తరువాత రాహుల్‌ ఇండియాను గెలిపించే బాధ్యత చేపట్టాడు. సిక్సర్లు, ఫోర్లతో స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు.

ఈ నేపథ్యంలో 52 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో వన్డేలలో తన 8వ అర్ధసెంచరీ పూరించాడు. అయిదో వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యం(63) నెలకొల్పిన రాహుల్‌ 288 పరుగులవద్ద జంపా బౌలింగ్‌లో హాజల్‌వ్ఞడ్‌ క్యాచ్‌ పట్టగా పెెవిలియన్‌ చేరాడు.

దీనితో ఇండియా విజయావకాశాలు అడుగంటాయి. హార్దిక్‌ పాండ్యా(28), రవీంద్ర జడేజా(24) కొద్దిసేపు ప్రతిఘటించినా కమిన్స్‌ వీరిరివురినీ ఒకే ఓవర్లో అవుట్‌ చేసి భారత్‌ పరాజయాన్ని ఖాయం చేశాడు.

ఆ తరువాత ఆసీస్‌ బౌలర్లు ఎనిమిది పరుగుల తేడాతో మూడు వికెట్టు పడగొట్టడంతో భారత్‌ 9 వికెట్లకు 338 పరుగులే చేయగలిగింది.

కమిన్స్‌ మూడు, హాజల్‌ , ఆడమ్‌ జంపా చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్‌, ఫించ్‌ మరోసారి సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభం అందించారు.

ఇరువురూ అర్ధసెంచరీలు సాధించి 16 ఓవర్లలో సెంచరీ భాగస్వామ్యం అందించారు. మరోసారి భారత బౌలర్ల బలహీనత బహిర్గతమైంది. ముందుగా ఫించ్‌ 69 బంతుల్లో ఒక సిక్సర్‌ ఆరు ఫోర్లతో 60 పరుగులకు షమి బౌలింగ్‌లో అవుఞటవగా, మరికొద్దిసేపటికి వార్నర్‌కూడా పెవిలియన్‌ చేరాడు.

శ్రేయస్‌ అయ్యర్‌ చురుకైన ఫీల్డింగ్‌తో వార్నర్‌ రనౌట్‌ అయ్యాడు. వార్నర్‌ 77 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 83 పరుగులు చేశాడు.

దీనితో భారత బౌలర్ల కష్టాలు తీరకపోగా రెట్టింపయ్యాయి.

తొలి వన్డేలో సెంచరీతో జోరుమీదున్న స్మిత్‌ మరోసారి భారత బౌలర్లపై విరుచుకుపడి 62 బంతుల్లోనే సెంచరీ పూరించి ఆసీస్‌ భారీ స్కోరుకు బాటలు వేశాడు. లబుషేన్‌తో కలిసి మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం(136) పరుగులు నెలకొల్పిన తరువాత 104 పరుగులకు నిష్క్రమించాడు.

కేవలం 64 బంతుల్లో రెండు సిక్సర్లు, 14 ఫోర్లతో స్మిత్‌ ఆ స్కోరు సాధించాడు. ఇక తరువాత వచ్చిన మాక్స్‌వెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి 25 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో అర్ధసెంచరీ పూరించాడు.

ఈ నేపథ్యంలో లబుషేన్‌కూడా 46 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకుని 70 పరుగులకు బుమ్రా బౌలింగ్‌లో అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. మాక్స్‌వెల్‌ 63 పరుగులతో అజేయంగా నిలిచాడు.

స్కోర్‌బోర్డ్‌ :

ఆస్ట్రేలియా – వార్నర్‌ రనౌట్‌ 83, ఫించ్‌ సి కోహ్లీ బి షమి 60, స్టీవ్‌ స్మిత్‌ సి షమి బి హార్దిక్‌ పాండ్యా 104, లబుషేన్‌ సి మయాంక్‌ అగర్వాల్‌ 70, మాక్స్‌వెల్‌ నాటౌట్‌ 63, హెన్రిక్స్‌ నాటౌల్‌ 2, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం(50 ఓవర్లలో 4 వికెట్లకు)389.
వికెట్ల పతనం : 1-142, 2-156, 3-292, 4-372.
బౌలింగ్‌ : మహ్మద్‌ షమి 9-0-73-1; జస్ప్రీత్‌ బుమ్రా 10-1-79-1; నవదీప్‌ సైనీ 7-0-70-0; యజువేంద్ర చాహల్‌ 9-0-71-0; రవీంద్ర జడేజా 10-0-60-0, మయాంక్‌ అగర్వాల్‌ 1-0-10-0; హార్దిక్‌ పాండ్యా 4-0-24-1.

ఇండియా –

మయాంక్‌ అగర్వాల్‌ సి అలెక్స్‌ కేరీ బి పాట్‌ కమిన్స్‌ 28, శిఖర్‌ ధావన్‌ సి స్టార్క్‌ బి హాజల్‌వ్ఞడ్‌ 30, విరాట్‌ కోహ్లీ సి హెన్రిక్స్‌ బి హాజల్‌వ్ఞడ్‌ 89, శ్రేయాస్‌ అయ్యర్‌ సి స్టీవ్‌ స్మిత్‌ బి హెన్రిక్స్‌ 38, కెఎల్‌ రాహుల్‌ సి హాజల్‌వ్ఞడ్‌ బి జంపా 76, హార్దిక్‌ పాండ్యా సి స్టీవ్‌ స్మిత్‌ బి పాట్‌ కమిన్స్‌ 28, రవీంద్ర జడేజా సి మాక్స్‌వెల్‌ బి కమిన్స్‌ 24, నవదీప్‌ సైనీ నాటౌట్‌ 10, మహ్మద్‌ షమి సి అండ్‌ బి మాక్స్‌వెల్‌ 1, జస్ప్రీత్‌ బుమ్రా ఎల్బీ జంపా 0, యజువేంద్ర చాహల్‌ నాటౌట్‌ 4, ఎక్స్‌ట్రాలు 10, మొత్తం(50 ఓవర్లలో 9 వికెట్లకు)338.

వికెట్ల పతనం : 1-58, 2-60, 3-153, 4-225, 5-288, 6-321, 7-321, 8-326, 9-328.

బౌలింగ్‌ : మైకేల్‌ స్టార్క్‌ 9-0-82-0; జోష్‌ హాజల్‌వుడ్‌ 9-0-59-2; పాల్‌ కమిన్స్‌ 10-0-67-3; ఆడమ్‌ జంపా 10-0-62-2; మోజెస్‌ హెన్రిక్స్‌ 7-0-34-1; గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 5-0-34-1.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/