దక్షిణాది రాష్ట్రాల కోసం అత్యున్నత పనితీరు కలిగిన ప్రీమియం కారు టైర్లు లెవిటాస్‌ అలా్ట్రను విడుదల చేసిన జెకె టైర్‌

హైదరాబాద్‌, 28 మార్చి 2023 : భారతీయ టైరు పరిశ్రమలో సుప్రసిద్ధమైన జెకె టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ఇప్పుడు అత్యంత వేగంగా విస్తరిస్తోన్న లగ్జరీ కారు విభాగంలో లెవిటాస్‌ అలా్ట్ర శ్రేణి టైర్లను విడుదల చేయడం ద్వారా ప్రవేశించింది. ఈ నూతన శ్రేణి లెవిటాస్‌ అలా్ట్ర శ్రేణి టైర్లను ప్రీమియం కార్ల కోసం డిజైన్‌ చేశారు. వీటిని దక్షిణాది రాష్ట్రాల కోసం జెకె టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ అన్షుమన్‌ సింఘానియా మరియు జెకె టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ అధ్యక్షులు శ్రీ అనూజ్‌ కథూరియాలు నేడు హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఆర్ధిక వ్యవస్ధ సానుకూలంగా కోలుకుంటున్న వేళ, భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమలో లగ్జరీ కార్లకు డిమాండ్‌ సైతం గణనీయంగా పెరుగుతుంది. ఈ మార్కెట్‌ దాదాపు 50% వృద్ధిని నమోదు చేస్తుంది. జెకె టైర్‌ , ఇప్పుడు లెవిటాస్‌ అలా్ట్రతో ఈ మార్కెట్‌లో వృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడంతో పాటుగా ఈ వృద్ధిని చక్కగా ఒడిసిపట్టగలదు.

జెకె టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ అన్షుమన్‌ సింఘానియా మాట్లాడుతూ ‘‘ లెవిటాస్‌ అలా్ట్ర విడుదల మా కంపెనీ , వృద్ధి చెందుతున్న విభాగాల అవసరాలను తీర్చడం మాత్రమే కాదు, మా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను ఆవిష్కరించడంతో పాటుగా ప్రీమియమైజేషన్‌ చేయాలనే మా నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది. అత్యుత్తమ పర్యావరణ అనుకూలసాంకేతికతను అందించాలనే మా నిబద్ధతకు అనుగుణంగా, ఈ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన టైర్లు, అత్యున్నత పనితీరు అందించడంతో పాటుగా ఇంధన పొదుపు పరంగా 5 స్టార్‌రేటింగ్‌ పొందాయి. అంతేకాకుండా ఇవి ఈ విభాగంలో అత్యుత్తమ డ్రైవింగ్‌ అనుభవాలను సైతం అందిస్తాయి’’ అని అన్నారు.

యూరోప్‌ మరియు ఇండియాలలో విస్తృతంగా పరీక్షించబడిన ఈ అలా్ట్ర హై పెర్‌ఫార్మెన్స్‌ (యుహెచ్‌పీ) టైర్లు కీలకాంశాలు– అత్యున్నత సౌకర్యం, అతి తక్కువ శబ్దం, అత్యధిక మన్నిక పరంగా అత్యున్నత శ్రేణి పనితీరును అందిస్తుంది. భారతీయ రోడ్డు పరిస్థితిలు, వాతావరణానికి అనుగుణంగా రూపొందించబడిన లెవిటాస్‌ అలా్ట్ర శ్రేణిని ఏడు పరిమాణాలలో అందిస్తున్నారు. ఇవి 225/55 ఆర్‌ 16 నుంచి 245/45 ఆర్‌ 18 వరకూ ప్రీమియం కార్ల కోసం ఉంటాయి. ఇవి బ్రాండ్‌ను మరింతగా చొచ్చుకు పోయేందుకు తోడ్పడతాయి. అంతేకాదు, జెకె టైర్‌ తమ పోర్ట్‌ఫోలియోను 19–22 అంగుళాల టైర్‌ శ్రేణి పరిచయంతో లెవిటాస్‌ అలా్ట్రతో విస్తృతం చేయడానికి ప్రణాళిక చేసింది. తద్వారా మొత్తం లగ్జరీ కార్ల శ్రేణి అవసరాలను తీర్చనుంది. సస్టెయినబిలిటీ ప్రయత్నాలను మరింతగా వృద్ధి చేయాలనే తమ నిరంతర ప్రయత్నాలలో భాగంగా , భారతీయ వినియోగదారులకు అత్యాధునిక ఉత్పత్తులను అందిస్తుంది. లెవిటాస్‌ అలా్ట్రకు ఇంధన పొదుపు పరంగా 5 స్టార్‌ రేటింగ్‌ అందించారు.

శ్రేణి అంతటా అధునాతన సాంకేతికత లగ్జరీ కారు విభాగం కోసం ప్రత్యేకంగా రూపొందించి, అభివృద్ధి చేసిన లెవిటాస్‌ అలా్ట్ర అసాధారణ సాంకేతిక లక్షణాలను కలిగి ఉంది. ఈ నూతన లెవిటాస్‌ అలా్ట్ర , అత్యున్నత శ్రేణి సవారీ మరియు నియంత్రణ కలిగి ఉండటంతో పాటుగా అత్యంత కఠినమైన సవారీ పరిస్ధితిలలో ఉన్నతమైన యోగ్యతను సైతం ఇది అందిస్తుంది. ఈ నూతన శ్రేణి తడి మరియు పొడి పరిస్థితిలలో అతి స్వల్పమైన బ్రేకింగ్‌ దూరం కలిగి ఉండటం వల్ల మెరుగైన భద్రతను సైతం అందిస్తుంది. లెవిటాస్‌ అలా్ట్ర యొక్క నియంత్రణ లక్షణాల వల్ల మహోన్నతమైన డ్రైవింగ్‌ స్పందనకు భరోసా అందించడంతో పాటుగా గరిష్ట వేగాలలో సైతం పూర్తి నియంత్రణ మరియు గ్రిప్‌కు భరోసా అందిస్తుంది. అడాప్టివ్‌ కాంటూర్‌ మరియు ప్రత్యేకమైన నాయిస్‌ క్యాన్సిలింగ్‌ ప్యాట్రన్‌ , అతి తక్కువగా క్యాబిన్‌ లోపల శబ్దాలకు భరోసా అందించడంతో పాటుగా ఆహ్లాదకరమైన సవారీని అందిస్తుంది.

ఈ యుహెచ్‌పీ టైర్లును హై–గ్రేడ్‌ ఎంఎఫ్‌ఎక్స్‌ పాలిమర్‌తో సూత్రీకరించారు. ఇది అసాధారణ మన్నికను భారతీయ రోడ్లు పై భరోసా అందించడంతో పాటుగా అత్యంత కఠినమైన మలుపులో సైతం స్థిరత్వం అందిస్తుంది. సూపర్‌ ఆప్టిమైజ్డ్‌ ట్రెడ్‌ పిచ్‌ సీక్వెన్స్‌ మృదువైన ప్రయాణాన్ని విస్తృత శ్రేణి వేగాలతో, తడి వాతావరణ పరిస్ధితిలలో సైతం అందిస్తుంది. గణనీయమైన మందంతో ఉన్న ధృడమైన పొరలు పెర్‌ఫోరేషన్స్‌కు అద్భుతమైన నిరోధక శక్తిని అందిస్తాయి.

భారతీయ మరియు యూరోపియన్‌ భూభాగాలో సమగ్రంగా పరీక్షించబడింది. భారతీయ రోడ్డు పరిస్థితిలు మరియు వాతావరణ పరిస్ధితిలలో అత్యంత సమర్థవంతమైన టైర్లు కావాల్సి ఉంది. అప్పుడు మాత్రమే మృదువైన డ్రైవింగ్‌, సౌకర్యవంతమైన సవారీ మరీ ముఖ్యంగా వేగం పెంచినప్పుడు కూడా అందిస్తాయి. మారుతున్న స్థానిక వినియోగదారులను అర్థం చేసుకోవడంలో జెకె టైర్‌ యొక్క దశాబ్దాల అనుభవం, విస్తృత శ్రేణి టెస్టింగ్‌ మరియు భారతీయ పరిస్థితిల కోసం లెవిటాస్‌ అలా్ట్రను పరిపూర్ణం చేయడంలో సహాయపడింది. ఈ ప్రీమియం టైర్లను , అత్యంత కఠినమైన సవారీ పరిస్థితిలలో అత్యున్నత యోగ్యతను పొందేందుకు భారతదేశంతో పాటుగా యూరోప్‌లో అత్యంత కఠినమైన పరిస్ధితిలు, భూభాగాలలో విస్తృత శ్రేణి పరీక్షలు, ట్రయల్స్‌ చేయడం ద్వారా దీని ప్రధాన డీఎన్‌ఏ అయిన అలా్ట్ర హై పెర్‌ఫార్మెన్స్‌తో ఆప్టిమైజ్‌ చేయబడి,స్వీకరించబడ్డాయి.

భారతదేశ వ్యాప్తంగా కీలక ప్రాంతాలలో లభ్యత

లెవిటాస్‌ అలా్ట్ర శ్రేణి టైర్లు ఏప్రిల్‌ 01, 2023 నుంచి కీలక నగరాలలో లభ్యమవుతాయి.