ఈడీకి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ లేఖ ..!

jharkhand-cm-hemant-soren-wrote-a-letter-to-ed

న్యూఢిల్లీః ఢిల్లీలోని జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ అధికార నివాసానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్న సోరెన్‌కు ఈ నెల 27న ఈడీ తొమ్మిదోసారి నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. మరోసారి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సి ఉందని.. జనవరి 29 లేదా 31 తేదీల్లో అందుబాటులో ఉండాలని పేర్కొంది. అయితే సీఎం హేమంత్ సోరెన్ మాత్రం ఈనెల 27 నుంచి అందుబాటులో లేకపోవడం గమనార్హం.

నిన్నటి నుంచి ఢిల్లీలోని తమ ఇంటి వద్ద దాదాపు 18 గంటల నుంచి పడి గాపులు కాశారు. ఈనెల 31లోపు ఈడీ కార్యాలయం వద్దకు రావాలని ఈ మెయిల్ చేశారు ఈడీ అధికారులు. అటు సీఎం అధికారుల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. ఎక్కడ ఉన్నాడనేది తెలియడం లేదు. నిన్న రాంచి నుంచి ఢిల్లీకి వచ్చినట్టు సమాచారం. బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నారు. రాజ్ భవన్, ఈడీ ఆఫీస్ వద్ద 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యలోనే ఈడీకి జార్ఖండ్ సీఎం లేఖ రాశారు. ఫిబ్రవరి 2 నుంచి బడ్జెట్ సమావేశాలున్నాయని ఆ లేఖలో తెలిపారు. జార్ఖండ్ కి సంబంధించిన బిజెపి నేతలు సోరెన్ పారిపోయారని పేర్కొంటున్నారు. ఈ సీఎం పై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.