వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్రారంభం

YouTube video
Launching of YSR Sampoorna Poshana & Sampoorna Poshana Plus by Hon’ble CM of AP at Camp Office

అమరావతి: ఏపి సిఎం జగన్‌ వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకాలను తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ పథకాల్లో ఇస్తున్న ఆహార పదార్థాల మెనూపై అధికారులను సిఎం వివరాలను అడిగి తెలుసుకున్నారు. జగన్‌ అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 4 రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండలాల పరిధిలోని 8 ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు నెలలో 25 రోజులపాటు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు అందజేస్తారు. టేక్‌ హోమ్‌ న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 2 కిలోల మల్టీ గ్రెయిన్‌ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకిలో రాగి పిండి, అరకిలో బెల్లం, అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడిపై నెలకి రూ.1,100 చొప్పున మొత్తం రూ.87.12 కోట్లు ఖర్చు చేయనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/