వైఫల్యాలు సరికొత్త ఆవిష్కరణలకు కారణమవుతాయి

వైఫల్యాలనుంచి నేర్చుకునేందుకు ఆమెజాన్‌ ఓ మంచి ప్రదేశం

Jeff Bezos
Jeff Bezos

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ ఆమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత్‌లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్‌ చేసేందుకు 1 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు జెఫ్‌ బెజోస్‌ ప్రకటించారు. ఇంకా వైఫల్యాల నుంచి నేర్చుకొనేందుకు ఆమెజాన్‌ ఓ మంచి ప్రదేశమని చెప్పారు. చిన్న, మధ్యతరహా ఆన్‌లైన్‌ వ్యాపారులతో నిర్వహించిన ఆమెజాన్‌ సంభవ్‌ సదస్సులో ఆమెజాన్‌ ఇండియా చీఫ్‌ అమిత్‌ అగర్వాల్‌తో జరిగిన ఇష్టాగోష్టిలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రయోగాల ద్వారా వచ్చే వైఫల్యాలు కొన్నిసార్లు సరికొత్త ఆవిష్కరణలకు కారణమవుతాయని తెలిపారు. ప్రతిభాపరంగా ఉండే వైఫల్యాలను మాత్రం నివారించుకోవాలన్నారు. భారత పర్యటనలో భాగంగా బెజోస్‌ చిన్నారులతో కలిసి పతంగులు వేసిన అనుభవం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. చిన్నప్పుడు తన తాతయ్య గారింట్లో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/