జీహెచ్‌ఎంసీ విభజనపై స్పందించిన కెటిఆర్‌

KTR
KTR

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీని విభజించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అన్నారు. అధికార వికేంద్రీకరణ జరగాలనే నేపథ్యంలోనే ఇలాంటి ఆలోచన చేశానని, దీంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడినందునే అధికార వికేంద్రీకరణ జరిగిందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మరో నాలుగేళ్లపాటు పట్టణాల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని ఆయన అన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని అమలు చేయడమే తమ ముందున్న అతిపెద్ద సవాల్‌ అని కెటిఆర్‌ చెప్పారు. టిఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులకు బిజెపి ప్రచారం చేస్తుందని కెటిఆర్‌ ఆరోపించారు. కొల్లాపూర్‌ రెబల్స్‌తో సహా అందరిని దారిలోకి తీసుకొస్తామని అన్నారు. టికెట్‌ రాలేదనే నెపంతో తమ మంత్రిపై అనవసరంగా బురద జల్లుతున్నారని కెటిఆర్‌ మండిపడ్డారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/