కొత్త జిల్లాలను కుదించడం ఉండదు.. : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

jeevan reddy
jeevan reddy

హైదరాబాద్‌ఃబిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను కుదించడం ఉండదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. వాటితో ప్రజలకు కొంత ప్రయోజనం చేకూరిందన్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వచ్చాయని, అటువంటి అభివృద్ధి వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రాన్ని కరీంనగర్ జిల్లాలో విలీనం చేయాల్సిందేనని, రేవంత్ రెడ్డి పర్యటనలో ఈ విషయమై తాను అక్కడి ప్రజలకు హామీ ఇచ్చానని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం సిద్దిపేట జిల్లాలో కలిపిన హుస్నాబాద్‌ను మునుపటిలా కరీంనగర్‌కు మార్చుతామని స్పష్టం చేశారు.