పెద్ద సినిమాలకు షాక్ : చిత్తూరులో భారీ ఎత్తున మూతపడ్డ థియేటర్స్

వరుస పెట్టి పెద్ద సినిమాలు రిలీజ్ కు సిద్ధం అవుతున్న తరుణంలో ఏపీలో వరుసపెట్టి పెద్ద సంఖ్యలో థియేటర్స్ మూతపడుతున్నాయి. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు థియేటర్ల తనిఖీలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న థియేటర్స్ ను సీజ్ చేస్తున్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లాలో 17 సినిమా థియేటర్లు మూతపడ్డాయి. మదనపల్లి, కుప్పం, పలమనేరు పుంగనూరులలో నిన్న మధ్యాహ్నం నుంచే షోలు రద్దు కాగా జిల్లా వ్యాప్తంగా 17 సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో మొత్తం 70 థియేటర్ల లైసెన్సులు పునరుద్ధరణ కాలేదని గుర్తించిన అధికారులు… 37 సినిమా థియేటర్లను మూసివే వేయాలని నిన్ననే ఆదేశాలు జారీ చేశారు.

అలాగే అనంతపురం జిల్లాలో పలు చోట్ల సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు యాజమాన్యాలు. పెనుకొండలో మూడు థియేటర్లు, గోరంట్లలో ఓ థియేటర్ ను స్వచ్ఛందంగా మూసివేశారు. ఇక గోదావరి జిల్లాలో కూడా దాదాపు 50 థియేటర్స్ కు పైగా మూసివేశారు. ఇలా వరుసగా థియేటర్స్ మూతపడడంతో సినీ లవర్స్ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉండగా..వాటిని వదిలేసి జగన్ థియేటర్స్ ఫై ఫోకస్ పెట్టారు ఏంటో అని మాట్లాడుకుంటున్నారు.