నోబెల్‌ గ్రహీతతో గ్రేటా థన్‌బర్గ్‌

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మలాలాను కలుసుకున్న గ్రెటా థన్‌బర్గ్

Greta Thunberg - Malala Yousafzai
Greta Thunberg – Malala Yousafzai

బ్రిటన్‌: నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ని స్వీడన్ బాలిక, ప్రముఖ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ కలుసుకుంది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో వీరిద్దరూ కలిసి నిన్న దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ సాహస బాలిక మలాలా ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న సంగతి తెలిసిందే. పర్యావరణంపై బ్రిటన్‌లో జరిగే ఓ నిరసన కార్యక్రమం కోసం వచ్చిన గ్రెటా ఈ సందర్భంగా మలాలాను కలుసుకుంది. యూనివర్సిటీ ఆవరణలోని ఓ బెంచిపై గ్రెటాను దగ్గరకు తీసుకుని దిగిన ఫోటోను మలాలా తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్టు చేసింది. థాంక్యూ గ్రెటా థన్‌బర్గ్ అని క్యాప్సన్ రాసింది. బాలికలకు విద్యా హక్కుల కోసం పోరాడిన మలాలా, పర్యావరణ మార్పు కోసం ఉద్యమిస్తున్న గ్రెటా ఇద్దరూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/