చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణను వైస్‌ఆర్‌సిపి జీర్ణించుకోలేకపోతోందిః కాల్వ శ్రీనివాసులు

చంద్రబాబును దొంగదెబ్బ తీసేందుకు జగన్ యత్నిస్తున్నారని ఆరోపణ

kalava-srinivasulu

అమరావతిః చంద్రబాబును దొంగదెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి జగన్ యత్నిస్తున్నారని టిడిపి నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వస్తున్న ప్రజాదరణను చూసి వైఎస్‌ఆర్‌సిపి జీర్ణించుకోలేకపోతోందని ఆయన మండిపడ్డారు. అందుకే చంద్రబాబును దొంగదెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి జగన్ యత్నిస్తున్నారని… ఇందులో భాగంగానే నందిగామలో కరెంట్ తీయించి రాళ్లు వేయించారని చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడినే భయపెట్టాలనుకోవడం దారుణమని… ప్రజాస్వామ్యంలో ప్రమాదకర సంకేతమని అన్నారు.

తన పాలనలో శాంతిభద్రతల వైఫల్యాన్ని జగనే చాటుకుంటున్నారని చెప్పారు. కరెంటు తీయించి, రాళ్లు వేయించడాన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు జగన్ ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి పిచ్చి పనులను మానుకోవాలని… లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/