షారుఖ్ ‘జవాన్’ రిలీజ్ డేట్

బాలీవుడ్ బాద్ షా – అట్లీ కలయిక లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘జవాన్’. ఈ సినిమా తాలూకా సరికొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇంత‌కు ముందు జూన్ 2న ఈ మూవీని రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అయితే సినిమా మేకింగ్, వి.ఎఫ్‌.ఎక్స్‌ల‌కు స‌మయం ప‌ట్టేలా ఉంద‌ని, కాబ‌ట్టి మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తారంటూ వార్త‌లు వినవ‌స్తున్నాయి. అయితే ఈ న్యూస్‌ను నిజం చేస్తూ నిర్మాత‌లు జ‌వాన్ రిలీజ్ డేట్‌ను సెప్టెంబ‌ర్ 7కు వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. అలాగే ఈ మూవీ లో నయనతార, విజయ్ సేతుపతి , ప్రియమణి , యోగిబాబు ముఖ్యమైన పాత్రలను పోషిస్తుండగా… సంజయ్ దత్ , విజయ్ , అల్లు అర్జున్ , దీపిక పదుకొణే అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.