అయ్యన్నపాత్రుడి నిర్భయ కేసుపై లోకేశ్‌

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్‌, టిడిపి సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదు కావడంపై స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ‘అయ్యన్నపాత్రుడు గారిది 37 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితం. 10 శాఖలకు మంత్రిగా చేసిన సుదీర్ఘ అనుభవం. వైఎస్ జగన్ గారితో కలిపి 10 మంది ముఖ్యమంత్రులను చూసిన అనుభవం. ఏజెన్సీ ప్రాంతానికి ఎంతో సేవ చేసిన సీనియర్ నేత’ అని అన్నారు. ఆపై ‘అలాంటి నేతపై ఏడాదిలో అట్రాసిటీ నుంచి నిర్భయ వరకూ జగన్ ప్రభుత్వం 7 కేసులు పెట్టింది. జగన్ పాలన ఎలా ఉంది అంటే ఒక్క నర్సీపట్నంలో పెట్టిన కేసులు చూస్తే చాలు అర్ధం అవుతుంది. జగన్ గారి లాంటి కుర్రకుంకలను చాలా మందినే చూసి ఉంటారు అయ్యన్నగారు’ అని అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/