నేటి నుండి జనంలోకి బాబు , జగన్

ఎన్నికల సమరానికి టిడిపి అధినేత చంద్రబాబు , వైసీపీ అధినేత జగన్ లు సిద్ధమయ్యారు. నేటి నుండి ఇరువురు తమ ప్రచారాన్ని మొదలుపెడుతున్నారు. జగన్ నేడు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రతో ఎన్నికల ప్రచార భేరికి శ్రీకారం చుట్టనున్నారు. మ.ఒంటిగంటకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, మ.1.30 నుంచి కడప పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. వేంపల్లి, VNపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రయాణించి సా.4 గంటలకు ప్రొద్దుటూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డకు చేరుకుని, అక్కడ బస చేయనున్నారు.

ఇటు చంద్రబాబు సైతం నేడు పలమనేరు నుంచి ‘ప్రజాగళం’ పర్యటన మొదలుపెట్టనున్నారు. ఈరోజు పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెలో పర్యటిస్తారు. రేపు రాప్తాడు, శింగనమల, కదిరి, శుక్రవారం శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటించనున్నారు. అలాగే ఈ నెల 30 నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తన ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుండి ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు. ఇలా ముగ్గురు జనాల్లోకి వెళ్తుండడం తో ప్రజల్లో ఆసక్తి నెలకొంది.