రెండేళ్ల త‌ర్వాత విదేశీ ప‌ర్యాట‌కుల‌కు జ‌పాన్ అనుమతి

టోక్యో: జ‌పాన్ రెండేళ్ల త‌ర్వాత విదేశీ ప‌ర్యాట‌కుల‌కు అనుమతిస్తుంది. క‌రోనా వ‌ల్ల విదేశీ ప‌ర్యాట‌కుల‌పై ఆ దేశం ఇన్నాళ్లూ నిషేధం విధించింది. సుమారు 98 దేశాల ప్ర‌జ‌లు త‌మ దేశానికి టూరిస్టుల్లా వ‌చ్చే రీతిలో జ‌పాన్ మార్పులు చేసింది. గ‌డిచిన రెండేళ్ల నుంచి జ‌పాన్ చాలా తీవ్ర స్థాయిలో కోవిడ్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌ను కూడా ఓ ఏడాది పాటు ఆల‌స్యం నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. విదేశాల్లో నివ‌సించే వారికి, వ్యాపార ప్ర‌యాణికుల‌కు ఇప్ప‌టికే ట్రావెల్ ఆంక్ష‌ల‌ను ఎత్తివేశారు.

జూన్ ఒక‌టో తేదీ నుంచి విదేశీ ప‌ర్యాట‌కుల సంఖ్య‌ను రోజుకు 20వేల‌కు చేసింది. మార్చి నుంచి విదేశీ విద్యార్థుల ప్ర‌వేశానికి ప‌ర్మిష‌న్ ఇచ్చారు. జూన్ 10వ తేదీ నుంచి టూర్ గ్రూపుల ప్ర‌వేశానికి అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. 2020 నుంచి ప‌ర్యాట‌కుల‌ను జ‌పాన్ ఆపేసింది. దీంతో స్థానిక టూరిజం ప‌రిశ్ర‌మ తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. టూరిస్టుల‌కు అనుమ‌తి ఇస్తూ ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను ట్రావెల్ ఏజెన్సీలు స్వాగ‌తిస్తున్నాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/