TTD నూతన ఛైర్మన్‌గా జంగా కృష్ణమూర్తి..?

టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. TTD చైర్మన్ YV సుబ్బారెడ్డి పదవికాలం ముగిస్తుండటంతో ఆ స్థానంలో MLC జంగా కృష్ణమూర్తిని నియమించాలని CM జగన్ భావిస్తున్నట్లు సమాచారం. టీటీడీ పదవి రేసులో చాలా మంది నేతల ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

జంగా కృష్ణమూర్తి గుంటూరు జిల్లా నేత. టీడీపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జంగా… తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ గుర్తుపైనే రెండుసార్లు ఎమ్మెల్యేగా గురజాల నుంచి విజయం సాధించారు. తర్వాత వైస్సార్సీపీ పార్టీలో కొనసాగుతున్నారు. 2019లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఓసారి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక వర్గం సభ్యుడిగా కూడా పని చేశారు. అందుకే ఆయన్నే టీటీడీ ఛైర్మన్‌గా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

ఇక ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న టైంలో పార్టీ పదవుల్లో కీలకమైన మార్పులు చేయాలని జగన్ భావిస్తున్నారట. వివిధ జిల్లాల్లో ఉన్న విభేదాలు, నేతల్లో ఉన్న అసంతృప్తితోపాటు వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు విజయం సాధించేలా ఈ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అందుకే అసంతృప్తి ఉన్న నేతలకు కీలక పదవులు ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తున్నారు జగన్.