టీడీపితో పొత్తుఫై పవన్ క్లారిటీ

టీడీపితో పొత్తు ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. మచిలీపట్నం లోని పార్టీ ఆవిర్భావ సభ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సభ లో పవన్ కళ్యాణ్ పొత్తుల ఫై క్లారిటీ ఇచ్చారు. జనసేన పార్టీకి ప్రజలు అండగా ఉంటారనే న మ్మకం భరోసా వస్తే.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్దమని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన ఒంటరిగా గెలుస్తుందని.. క్షేత్రస్థాయి రిపోర్టులు వస్తే.. ఒంటరి పోరుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో పరోక్షంగా తాను ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని పవన్ తేల్చేశారు. తాను వస్తే.. పూలమాలలు, గజమాలలు వేయడం కాదు.. తనకు ఓట్లు వేయండని ప్రజలకు పిలుపు నిచ్చారు. తన కోసం గుండెలు బాదుకోవడం కాదు… గుండెల్లో పెట్టుకొని ఒటేయండి చాలని అన్నారు.

రాష్ట్రంలో చదువుకున్న యువత ఓటు విషయంలో ఆలోచించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో కులం చూసి కాకుండా గుణం చూసి ఓటు వేయాలని యువతకు పిలుపునిచ్చారు. తనకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారని తెలిపారు. ఓటు వేసే సమయంలో మా కులపోడు అని చూడకుండా.. అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఓటు క్రీయశీల పాత్ర పోషించనుందని.. ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ప్రతి కులానికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. గతంలో కమ్మ, కాపు, బీసీ కులాల గురించి మాట్లాడలేకపోయేవాడిని. కానీ ఇది సత్యం. ప్రస్తుత పరిస్థితుల్లో పీడితుల పక్షాన నిలబడాల్సిన అవసరం వచ్చిందన్నారు. నన్ను కులం పేరుతో దూషిస్తారని.. కానీ అలాంటి మాటలను తాను పెద్దగా పట్టించుకోనని పవన్ అన్నారు. కొన్ని సందర్భాల్లో కొందరు కులాన్ని అమ్మేస్తానంటే బాధగా ఉంటుందని తెలిపారు. నేను విశ్వనరుడిని. అంతా బాగుండాలని కోరుకునేవాడిని. కులాల మధ్య చిచ్చుపెట్టలేను. అల్పసంఖ్యాక కులాలు బాగుండాలని భావించేవాడిని. 60 కి పైగా కులాలకు అన్నీ సమస్యలే. ఈ కులాల నుంచి మేధావులు వస్తారు. అలాంటిసమూహాన్ని నాయకులుగా చేయడానికి పార్టీ పెట్టాం. కుల కార్పొరేషన్లు పెట్టారు. అవి ఎందుకు ఉపయోగం లేదు. ఇలాంటివి మారాలి అన్నారు పవన్ కళ్యాణ్.