ప్రభుత్వ పథకాలపై సోషల్ ఆడిటింగ్ నిర్వహిస్తున్న జనసేన

ఏపీలో జగన్ ప్రభుత్వం ఫై జనసేన పార్టీ యుద్ధం చేస్తుంది. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలను చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రోడ్ల పరిస్థితి ఫై సోషల్ మీడియా లో పోస్టులు పెట్టి హల్చల్ చేసిన జనసేన..ఇప్పుడు పథకాలపై సోషల్ ఆడిటింగ్ నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధమయింది. ఇందులో భాగంగా ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జగనన్న ఇళ్ల పథకంపై సోషల్ ఆడిట్ ను నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న ఇళ్ల కాలనీలు, టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను జనసేన నేతలు పరిశీలించనున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు విజయనగరం జిల్లా గుంకలాంలోని అతి పెద్ద జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించనున్నారు. విజయనగరంతో పాటు రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో జరిగే సోషల్ ఆడిట్ కార్యక్రమంలో కూడా పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నారు. మరోవైపు ఇప్పటికే ‘జగనన్న ఇళ్లు.. పేదలకు కన్నీళ్లు’ పేరుతో జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ’జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో పోస్టర్‌ను ఉత్తరాంధ్ర జనసేన నాయకులు ఆవిష్కరించారు.